పెద్ద దోర్నాల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సందర్శకులను కనువిందు చేసింది. సోమవారం గుజరాత్ కు చెందిన పర్యటకులు జంగిల్ సఫారీ చేస్తుండగా పెద్దపులి దర్శనమిచ్చింది. పర్యటకులు పులిని చూసి తమ మొబైల్ ఫోన్ లలో చిత్రీకరించారు. జీపులో జంగిల్ సఫారీ కి వెళ్లిన సందర్శకులు పెద్దపులిని చూసిన అనుభవాన్ని అటవీశాఖ అధికారులతో పంచుకున్నారు. తుమ్మలబైలు సమీపంలో వన్యప్రాణులు అధికంగా తిరుగుతుంటాయని అధికారులు చెప్పారు.