మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

82பார்த்தது
మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
పట్టపగలే దొంగ రెచ్చిపోయాడు. బుధవారం పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో గ్రామానికి చెందిన పద్మ పోలేరమ్మ గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుంది. ఈ క్రమంలో అటు వైపు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ దొంగ పద్మ మెడలోని రెండు సవర్ల బంగారు గొలుసు లాక్కొని ఉడయించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పట్టపగలే ఈ సంఘటన జరగడంతో స్థానికులు అవాక్కయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி