గుండెపోటుతో మేకల కాపరి మృతి

71பார்த்தது
గుండెపోటుతో మేకల కాపరి మృతి
ప్రకాశం జిల్లా, పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేకల కాపరి ముత్తమ్మ గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం జరిగింది. మేకల కాపరి ముత్తమ్మ మేకలను గ్రామ సమీపంలో మేత కోసం తీసుకువెళ్లింది. ఈ క్రమంలో మహిళ ముత్తమ్మ గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

தொடர்புடைய செய்தி