ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం నిర్వహించిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల అసోసియేషన్ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవవచ్చన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న గిరిజన ఉద్యోగులు పాల్గొన్నారు.