రాచర్ల మండలం జే పుల్లలచెరువు గ్రామ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామికి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.