దృష్టి సమస్యలను ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ 'సైట్ కనెక్ట్' పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. ఇన్ఫోసిస్ సంస్థతో కలిసి అందుబాటులోకి తెచ్చింది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన వివరాలు నమోదు చేయాలి. యాప్‌లో ఒకటి తర్వాత ఒకటి 21 చిత్రాలు కనిపిస్తాయి. పక్కన దానికి సంబంధించి ప్రశ్న ఉంటుంది. ఆ చిత్రం చూసి వాటికి జవాబు క్లిక్ చేస్తే దృష్టి లోపం ఉందో, లేదో తెలిసిపోతుంది.