పొన్నలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డీఎస్పీ శ్రీనివాసరావు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలన్నారు. ఇక అపరిచిత వ్యక్తులు చేస్తున్న ఫోన్ కాల్స్ తో జాగ్రత్త వహించాలని మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా నెంబర్ ఓటిపి నంబర్ ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. ఇక విద్యార్థినీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రస్తుతం జరుగుతున్న అత్యాచార ఘటనలపై వివరించి చెప్పారు.