కొండేపి: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

50பார்த்தது
కొండేపి: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
ప్రకాశం జిల్లా కొండేపిలోని మద్దలూరు రోడ్డులో మంగళవారం ఓ వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎస్సై ప్రేమ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ప్రేమ్ కుమార్ చెప్పారు. మండలంలో అక్రమంగా మద్యం తరలించిన లేదా అమ్మిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி