కొండపి మండలం వేరేడేపి గ్రామంలో అక్రమంగా మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని స్థానిక ఎస్సై ప్రేమ్ కుమార్ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతని వద్ద నుంచి 13 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మండలంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తుంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.