కనిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా దేవలపల్లి సుబ్బారెడ్డిని పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆదివారం నియమించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని వైయస్ షర్మిల కల్పించారని, మరలా తనని ఇన్ చార్జిగా నియమించటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు.