కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం రాత్రి తెలిపారు. ఆ వ్యక్తి వద్ద నుండి 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.