కోరిశపాడు: మైనర్ కాలువలో వెంటనే పూడిక తీయాలి
కోరిశపాడు మండలం, తమ్మవరంలో ఎన్.ఎస్.పి మేజర్ కాలువ ద్వారా, సబ్ మెరైన్ నుండి మైనర్ కాలువను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్మించారు. కాగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు, మైనర్ కాలువను పూర్తిగా పూడ్చివేసి అక్కడ జామాయిల్ సాగు చేస్తున్నారు. ఆ విషయాన్ని గ్రామానికి చెందిన బోయపాటి. చౌదరి ఇరిగేషన్ ఈ.ఈ విశ్వమోహన్ కు ఫిర్యాదు చేయగా, బుధవారం ఈ.ఈ స్వయంగా మైనర్ కాలువను సందర్శించి, రైతులతో మాట్లాడి కాలువలో వెంటనే పూడిక తీసి, కాలువను యధాతధిగా నిర్మించాలని ఆదేశించారు.