కొరిసపాడు మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను వీఆర్వోలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలా పరిష్కరించకపోతే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.