అద్దంకి మండలం, మణికేశ్వరం గ్రామస్తులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన, మణికేశ్వరం శ్రీ గంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే వేడుకలకు మంత్రిని గ్రామస్తులు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయం ఈ. వో వాసు, టి. డి. పి నాయకులు కరీముల్లా పాల్గొన్నారు.