ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ విధానం అమలును నిరసిస్తూ యువతను చైతన్య పరిచే కార్యక్రమాలలో భాగంగా సోమవారం దేనువుకొండ గ్రామంలో అవగాహన సదస్సును అద్దంకి నియోజకవర్గ మాలమహానాడు కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాల మహానాడు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.