అద్దంకి మండలం తిమ్మాయపాలెం లోని గుండ్లకమ్మ లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన దుర్గాప్రసాద్ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎట్టకేలకు గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. ఉదయం నుంచి శ్రమించి ముళ్ళ చెట్ల మధ్య చిక్కుకున్న మృతదేహాన్ని వారు వెలికి తీశారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.