కొరిశపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో సరుకుల వివరాలను ఆమె ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పలు సబ్జెక్టులపై ఆమె ఆరా తీశారు. పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.