కొరిశపాడు మండలంలో 21వ అఖిలభారత పశుగణన కార్యక్రమం జరుగుతుందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణన ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వెంకటరావు తెలిపారు. ఈ కార్యక్రమం వలన రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.