ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 171 మద్యం దుకాణాలకు 3,416 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ఒంగోలులో 34 దుకాణాలకు 595 దరఖాస్తులు వచ్చాయన్నారు. అత్యల్పంగా గిద్దలూరులో 13 దుకాణాలకు 231 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 68.32 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.