విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని, ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో సమావేశాన్ని నిర్వహించి నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అసమర్ధ, అవినీతి విధానాలతో అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసిందని ఆ భారాన్ని ప్రజలపై మోపటం న్యాయం కాదని తెలిపారు.