విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం పొదిలి ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించి, ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా రోగులను బయట ఆసుపత్రులకు పంపుతున్నారని ఫిర్యాదు చేశారు.