2025 మార్చి నాటికి పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని రాజా నగర్ లో శనివారం నిర్వహించిన మన ఇళ్లు-మన గౌరవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గత ప్రభుత్వం 20% మిగిలిపోయిన టీక్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేక పోయిందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయల సహాయం అందిస్తుందన్నారు.