పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో సోమవారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆమె నివాసం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో శంకుస్థాపనలు ఎటువంటి సమస్యలు లేకుండా కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే పనులు ప్రారంభం చేయాలని మన్యం జిల్లాలో గల అధికారులకు మంత్రి సంధ్యారాణి సూచనలు చేశారు.