సచివాలయం ఉద్యోగస్తులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని గ్రామ, వార్డు సచివాలయల జిల్లా ప్రత్యేక అధికారి బి. రాంగోపాల్ తెలిపారు. బుధవారం సాలూరు నియోజకవర్గంలో మక్కువ, సాలూరు పట్టణం, పాచిపెంట మండలం వేరువేరుగా సచివాలయ ఉద్యోగులతో ఆయా మండల మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న హౌస్ హాల్ట్ మరుగు దొడ్లు తదితర అంశాలపై సమీక్షించారు.