మక్కువ మండలం నంద పంచాయితీ పెదఊటగడ్డ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరక్తి చెంది, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనమెచ్చి మక్కువ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వెంపడాపు సుగుణేశ్వరరావు అధ్యక్షతన సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాలూరు నియోజకవర్గం సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ పాల్గొన్నారు. ఆ యొక్క కుటుంబాలను ఆయన జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.