మంత్రి నారా లోకేష్ దృష్టికి విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర తీసుకువెళ్లారు. పాఠశాలల పరిస్థితి వాటి అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను గురువారం మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. తెలుగు కూడా బోధించేందుకు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. పురపాలక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల సమస్యలను కూడా తెలిపారు.