పార్వతీపురం మండలంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న డి. పట్టాలు, కొండ పారంబోకు, అడవి భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా సిపిఎం పట్టణ కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కొండలను, వాగులను చదును చేసుకుంటున్న గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. జిల్లా సిపిఎం కార్యదర్శి రెడ్డి వేణు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.