ప్రధాన మంత్రి జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ప్రణాళికలు సమర్పించాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్ జయ ఆదేశించారు. ప్రధాన మంత్రి జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పై వివిధ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ లో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి క్రింద ప్రణాళికలను గురువారం నాటికి సమర్పించాలని అన్నారు.