నెల్లిమర్ల: విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి

72பார்த்தது
నెల్లిమర్ల: విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి
విద్యార్థులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని నెల్లిమర్ల ఎస్సై బి గణేష్ కోరారు. మండలంలో సతివాడ జడ్పీ హైస్కూల్లో శనివారం ఆయన విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరితో గౌరవంగా నడుచుకోవాలని కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி