నెల్లిమర్ల మండలం జరజాపుపేట, మొయిద తదితర గ్రామాల్లో మంగళవారం చేపట్టిన పశు గణన సర్వేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వై వి రమణ పరిశీలించారు. పశుగణన సర్వేకు పాడి రైతులు సహకరించాలని కోరారు. రైతులను సంప్రదించి పాడి పశువుల వివరాలను పారదర్శకంగా సేకరించి నమోదు చేయాలని తెలిపారు. సర్వే పూర్తి చేసి నివేదికలు త్వరితగతిన అందించాలని కోరారు. పశు గణన సర్వేపై రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు.