మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు శరత్ చంద్ర ఇటీవల స్వర్గస్తులైన సందర్భంలో విదేశీ పర్యటన ముగించుకొని విజయనగరం జిల్లాకు వచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం అరుణని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో గుండె ధైర్యంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి అరుణకి మంత్రి శ్రీనివాస్ సూచించారు.