గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డీఈ సింహాచలం, ఏఈ శ్యాంప్రసాద్ రెండు రోజుల క్రితం సస్పెండ్ అయ్యారు. 2021లో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఫోర్జరీ సంతకాలతో పక్కదారి పట్టించడంతో వీళ్లపై వేటు పడింది. వీళ్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని గిరిజన సంఘాల నాయకులు గురువారం కోరారు.