ఆండ్ర: డిజిటల్ అరెస్టు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలు పట్ల ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆండ్ర పోలీసు స్టేషను శుక్రవారం సందర్శించారు. పోలీసు స్టేషను పరిసరాలు, ప్రాపర్టీ రూం, లాకప్ సెల్స్, సీజ్డ్ వాహనాలను పరిశీలించారు. రికార్డులు, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు, వృద్దులకు చీరలు, దుప్పట్లను, యువతకు వాలీబాల్ కిట్స్ పంపిణీ చేశారు.