గంట్యాడ మండలం దిగువ కొండపర్తిలో గురువారం ఎంపీడీవో ఆర్ వి రమణమూర్తి ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి సత్వర కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రజలకు క్లోరినేషన్ చేసిన త్రాగునీరు సరఫరా చేయాలని కోరారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.