నైపుణ్య గణన ను సిబ్బంది పారదర్శకంగా పక్కాగా నిర్వహించాలని ఎంపీడీవో బి.కళ్యాణి అన్నారు. గజపతినగరం ఎంపీడీవో కార్యాలయంలో ఆమె బుధవారం పంచాయితీ కార్యదర్శులకు నైపుణ్య గణనపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా సర్వే చేపట్టి, నైపుణ్య గణన చేయాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన నైపుణ్య గణన నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.