గంట్యాడ మండలంలో 153 గోకులాలు మంజూరు
గంట్యాడ మండలంలో 153 గోకులాలు మంజూరైనట్లు డ్రామా ఏ పీ డి సుధారాణి తెలిపారు. స్థానిక ఉపాధి హామీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. పాడి రైతులకు మంజూరైన గోకులాల నిర్మాణాలను డిసెంబర్ 15 కల్లా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మండలంలో 1000 సోక్ పిట్ లు మంజూరయ్యాయని, మండలంలో ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ కు 10 చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. వీటి నిర్మాణ బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగించినట్లు తెలిపారు.