సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు సీఎం జిల్లాకు రానున్నారు. గజపతినగరం మండలం పురిటిపెంట వద్ద రహదారి మరమ్మతు పనులను సీఎం ప్రారంభించనున్నారు. హెలిప్యాడ్ వద్ద వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. 826 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రహదారుల మరమ్మతు పనులను సీఎం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.