గంట్యాడ గ్రామపంచాయతీని ప్రభుత్వం సుస్థిర అభివృద్ధిలో భాగంగా మహిళా స్నేహపూర్వక గ్రామపంచాయతీ గా జాతీయస్థాయిలో అవార్డు ఎంపిక కొరకు ప్రతిపాదించడం జరిగిందని ఎంపీడీవో ఆర్వీ రమణమూర్తి సోమవారం తెలిపారు. పంచాయతీకి సంబంధించి డాక్యుమెంటరీని త్వరలో సెంట్రల్ టీం పరిశీలించడం జరుగుతుందని, ఇందులో ముఖ్యంగా మహిళా గ్రామసభ, పంచాయతీ సమావేశాలు తదితర అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ పంచాయతీకి అవార్డు రావాలని ఆయన ఆకాంక్షించారు.