రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఇ డిపార్ట్ మెంట్, ఇండస్ట్రీస్, సెర్చ్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.