పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో గురువారం స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఆ అంశానికి సంబంధించి డిబేట్, పెయింటింగ్, కార్టూన్, మొదలైన వాటిలో పాల్గొని చార్ట్ లను ప్రదర్శించారు. స్థానికంగా దొరికే రీసైకిల్డ్ రా మెటీరియల్ తో ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం విద్యార్థులకు నేర్పించారు. దీనిలో హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పున్నారావు, పీడి అరుణశ్రీ పాల్గొన్నారు.