కామ్రేడ్ సాయిబాబాకు ప్రజా సంఘాలు నివాళి .
90 శాతం వికలాంగుడైన ప్రజా ఉద్యమకారుడు ప్రొఫెసర్ కామ్రేడ్ జి ఎన్ సాయిబాబా అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి అమరుడయ్యారు. తప్పుడు కుట్ర కేసులో జైలు జీవితం అనుభవించిన ఆయన, అనేక వ్యాధులతో మరణపు అంచుల్లోకి వెళ్లారు. ఇటీవల ముంబై హైకోర్టు నుండి నిర్దోషిగా విడుదలైన ఆయనకు ఆదివారం నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద ప్రజాసంఘాల నాయకులు నివాళులు అర్పించారు.