ఈ నెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. నిధి మీనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు.