రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు, ఎయిడ్స్, టీబీ, కుష్టు తదితర కేసులపై క్షుణ్ణంగా చర్చించారు. జిల్లాలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అనే వివరాలు ఆరా తీశారు.