విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, ఇండోర్ స్టేడియాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) అధికారులను ఆదేశించారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో తాడిగడపలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సుజనా చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు.