ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు శనివారంతో ముగిసి పోతాయి. చివరి రోజు సాయంత్రం తెప్పోత్సవం కృష్ణా నదిలో అమ్మవారికి హారతి ఇస్తారు. అయితే కృష్ణా నదికి వరద నీరు ఎక్కువగా రావటంతో, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈ సంవత్సరం తెప్పోత్సవ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో అక్కడే తిప్పోత్సవం పై అమ్మవారికి హారతి ఇవ్వనున్నారు.