విజయవాడ: అనుమతులు తప్పనిసరి

60பார்த்தது
విజయవాడ: అనుమతులు తప్పనిసరి
దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా విక్రయాలు, మందు గుండు సామాగ్రి నిలువలకు వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు జరిపే వారు సంబంధిత అన్ని విభాగాల అనుమతులు తప్పనిసరిగా పొందాలని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు, నిల్వలు, తయారీ చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி