శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానం నందు దేవీ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారి భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనీశ్వర దేవాలయానికి ఎదురుగా కేశఖండనశాల ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారికి తలనీలాలు సమర్పించే భక్తులు లేకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తుంది. 200 మందికి పైగా ఒక్కసారే తలనీలాలు అర్పించే విధంగా ఏర్పాటు చేశారు.