ఉదయగిరి తాలుకా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామ పంచాయతీకి కేటాయించిన చెత్త సేకరణ వాహనం నిరుపయోగంగా ఉంది. చర్చీ సమీపంలోని రోడ్డు పక్కన కొన్ని నెలలుగా వాహనాన్ని నిలిపివేశారు. వాహనాన్ని ఒకే చోట నిలిపివేయడంతో.. ఆ వాహనం శిథిలావస్థకు చేరుకుంది. వాహనానికి మరమ్మతులు నిర్వహించి.. అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.