ఉదయగిరి దుర్గంలోని సల్వా పేట నీటి ప్రవాహం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, ప్రకృతి అందాలు అందరిని ఆకర్షిస్తున్నాయని ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా చేపట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. చెంచల బాబు యాదవ్ పేర్కొన్నారు. ఉదయగిరి మండలంలోని దుర్గం పల్లి గ్రామంలో ఉన్న కోన కాలువ, వల్లభ రాయి ఉదయలక్ష్మి దేవాలయాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఆయనతో స్థానిక టిడిపి నాయకులు ఉన్నారు.