జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఇల్లును ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. బాధితులైన గ్రామానికి చెందిన మైనంపాటి వినోద్ కుమార్- జంగం మౌనికను కలిశారు. ఇంటితోపాటు సుమారు మూడు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయారు. రెవిన్యూ, ఫైర్ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితుడికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.